సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే తప్పవిక కఠిన చర్యలు : పుంగనూరు సిఐ సుబ్బరాయుడు

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
సోషల్ మీడియా వేదికల్లో ద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు పోలీసులు హెచ్చరించారు.
సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా పోస్టులు చేయడం, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారి సోషల్ మీడియా ఖాతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రజలు బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను వినియోగించి సామాజిక సామరస్యాన్ని కాపాడాలని పోలీసులు కోరారు.

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *