ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్య వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు :

పుంగనూరు నుండి బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారి,దుస్థితిపై ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర మైనారిటీ నాయకుడు అయూబ్ ఖాన్, ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు సమీపంలోని 50 రాళ్ల మరవలో,ఉన్న శనేశ్వరస్వామి ఆలయానికి, ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారని, రహదారిపై ఎగిసిపడుతున్న దుమ్ము, ఆలయ ప్రాంగణంలోకి చేరి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా రహదారి మరమ్మతుల కోసం, పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆర్‌అండ్‌బీ అధికారులు నామమాత్రపు పనులతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పుంగమ్మ చెరువు కట్ట వద్ద రహదారి పూర్తిగా దెబ్బతిన్నా, తారు కొరత యుద్ధ పరిస్థితులు వంటి కారణాలు చూపుతూ, పనులు చేపట్టకపోవడం బాధాకరమని పేర్కొన్నారు
ఈ రహదారి దుస్థితి కారణంగా గతంలో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ద్విచక్రవాహనం స్కిడ్ అయి మృతి చెందిన ఘటనను గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన,ఈ రహదారిని బుధవారం లోగా పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని లేదంటే, ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని అయూబ్ ఖాన్ హెచ్చరించారు

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *