ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమం లో పాల్గొన్నఅన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు

పుంగనూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలంతా భాగస్వామ్యం కావాలని అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ కళ్యాణి పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పట్టణంలోని ఎన్‌టీఆర్ సర్కిల్‌లో పారిశుధ్య కార్మికులతో కలిసి రహదారులను శుభ్రం చేశారు. అనంతరం రాయల్ చెరువు కాల్వను పరిశీలించి పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి పలు సూచనలు చేశారు. తర్వాత పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాల పరిశుభ్రత ఆహార నాణ్యతపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సబ్ కలెక్టర్ కళ్యాణి ఆదేశించారు.

Share This Article
1 Comment
  • Hi, I do believe this is a great site. I stumbledupon it 😉 I may return once again since I book
    marked it. Money and freedom is the greatest way to change, may you be
    rich and continue to guide other people.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *