పుంగనూరు మార్కెట్ యార్డ్ కు తాళం వేసి నిరసన తెలిపిన రైతులు

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుపై దాడి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
రామసముద్రం మండలం మిట్ట చీమనపల్లికి చెందిన రైతు వెంకటరమణ శనివారం రాత్రి మార్కెట్ యార్డులో ఓ లారీ డ్రైవర్‌తో ఘర్షణ చోటుచేసుకుంది.
ట్రాక్టర్ అడ్డుగా ఉందన్న కారణంగా ప్రారంభమైన వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో, లారీ డ్రైవర్లు రైతుపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో రైతు గాయపడగా ఆదివారం రైతులు మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో రైతుల సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందించే పరిస్థితి లేదని కొంతకాలంగా మార్కెట్ నిర్వహణ పూర్తిగా గందరగోళంగా మారిందని రైతులు ఆరోపించారు. ముఖ్యంగా గుమస్తా స్థాయి అధికారి అన్ని వ్యవహారాల్లో తానే అన్నట్లు వ్యవహరిస్తూ మార్కెట్‌ యాడ్లో పెత్తనం చెలాయిస్తున్నారని పలువురు రైతులు విమర్శించారు.
మార్కెట్‌ యాడ్లో జరిగే ప్రతి అంశంలో ఆయన జోక్యం పెరిగిపోయిందని రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ లోని పరిస్థితులపై అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. రైతుపై దాడికి పాల్పడిన వారిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *