అధికారుల వైఖరి మార్చుకోకపోతే అర్థనగ్న నిరసన కార్యక్రమానికి సిద్ధమే

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు :

అధికారుల నిర్లక్ష్య వైఖరి పై నిరసన కార్యక్రమం చేపట్టిన SC, ST మానటరింగ్ కమిటీ సభ్యులు బుధవారం పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో జరిగే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి తహసిల్దార్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పలువురు అధికారులు గైహాజరు కావడంపై కార్యాలయం ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.తమ కష్టాలు సమస్యలు విన్నవించడం కోసం వస్తే అధికారులకు సక్రమంగా రాకపోవడం విచారకరమన్నారు. నెలకు ఒక్కరోజు జరిగే సమావేశానికి కూడా రాకపోవడం బాధాకరమన్నారు.అధికారులకు చిన్న చూపు తగదని ఆ సంఘ నాయకులు పేర్కొన్నారు
అధికారులు అన్ నిర్లక్ష్య వైఖరిని మార్చుకోకపోతే అర్థనగ్న నిరసనకు మేము సిద్ధమని అధికారులను హెచ్చరించిన ఎస్సీ ఎస్టీ మానటరింగ్ కమిటీ సభ్యులు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *