పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని ఎఫ్ఆర్వో చంప్లా నాయక్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలమనేరు ఎఫ్ఆర్వో గా పనిచేసిన నారాయణ ఈ మధ్యకాలంలో పదవీ విరమణ పొందారు. దీంతో మడకశిర డిఆర్ఓగా పనిచేస్తున్న చంప్లా నాయక్ పదోన్నతి పై పలమనేరు ఎఫ్ఆర్ఓ గా విధుల్లో చేరారు. దీంతో తొలిసారి స్థానిక ఎమ్మెల్యేను ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుష్పగుచ్చమందించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధి, అటవీ పరిరక్షణ మరియు ప్రజా సమస్యలపై వారు చర్చించారు. తమ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్ఆర్ఓ తెలిపారు. ఎమ్మెల్యే సైతం అధికారుల సేవలను అభినందించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సలాలుద్దీన్, ఎఫ్ఎస్వో సుకుమార్ తో పాటు అటవీ శాఖా సిబ్బంది ఉన్నారు..
