వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు :

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, 17వ వర్ధంతి కార్యక్రమాన్ని పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన అందించిన ప్రజాసేవ, సంక్షేమ పాలనను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article