వర్చువల్ విధానంలో మినీ మహానాడుని ఘనంగా నిర్వహించిన టిడిపి నాయకులు

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు :

పుంగనూరు పట్టణంలో ట్రావెల్స్ బంగ్లాలో క్లస్టర్ పరిధిలో వర్చువల్ విధానంలో సాగిన మహానాడు పండుగ వాతావరణం లో జరిగింది.

మొదట ఎన్టీఆర్ సర్కిల్లో రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

రాజపేట పార్లమెంటు సెక్రెటరీ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినాదంతో పార్టీని స్థాపించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు

,ఈసారి మహానాడు ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో జరుగుతోందన్నారు. పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ కౌన్సిలర్ దేశాల ప్రకాష్, విశ్రాంతి డిఎస్పి సుకుమార్ బాబు, వెంకటరమరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్, సివి రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *