వడ్డూరు గంగమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

Prajalapaksham
1 Min Read

ఘనంగా ఆహ్వానించిన గ్రామస్థులు

పెద్దపంజాని మండలం కొలత్తూరు పంచాయతీ గూబగుండ్ల పల్లి (వడ్డూరు) నందు జరిగిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ఆయన మండల టీడీపీ నాయకులతో కలసి ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, మహిళలు మంగళహారతులతో మంగళవాయిద్యాల మధ్య ఘనంగా స్వాగతం తెలియగా జాతర నిర్వహకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. పల్లెలు పాడిపంటలతో కళకళలాడాలని , ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.”మన సంస్కృతి, సంప్రదాయాలకు ఈ జాతరలు ప్రతిబింబాలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగలో అందరితో కలసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.”
​ఈ కార్యక్రమాల్లో నాయకులు మురహరి రెడ్డి, రోజా రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీ రాములు, ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం గ్రామస్థులు రఘు, రామూర్తి, సూరి, ఆదినారాయణ తదితరులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *