భూ సేకరణ నుండి తమ భూములను మినహాయించాలి

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు

పుంగనూరు మండలం మేలుం దొడ్డి పంచాయతీ గోపిశెట్టిపల్లికి చెందిన రైతులు పుంగనూరు తహసిల్దార్ కలిసి వినతి పత్రం అందజేశారు.పెప్పర్ మోషన్ బస్సుల కంపెనీకి భూములు కేటాయించాలని నిశ్చయిస్తూ గత ప్రభుత్వం 2023లో సర్వే చేపట్టింది. అప్పుడే చిత్తూరు కలెక్టర్ కు అర్జీలను సమర్పించినట్లు చెప్పారు. తర్వాత ఎలక్షన్లు రావడంతో సర్వే ఆపేశారు. మళ్లీ తిరిగి సర్వే చేస్తున్నడంతో బాధగా ఉందన్నారు. తామంతా చిన్న సన్న కారు రైతులని 135 కుటుంబాలు ఆ భూములు మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అప్పులు చేసి మరి బోర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పారు. వారిభూములను భూ సేకరణ నుండి మినహాయించాలని కోరారు. తమ భూములను పరిశ్రమ కు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *