బస్సు షెల్టర్లు లేక ప్రయాణికుల ముప్పు తిప్పలు

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు

పుంగనూరు పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా పట్టణం లోని తూర్పు మొగసాల, ట్యాంక్ బ్యాండ్,కొత్తయిండ్లు, ముడేప్ప సర్కిల్ రోడ్డుకి ఇరువైపులా చెట్లను తొలగించడంతోపాటు బస్సు ప్రయాణం చేసే ప్రయాణికుల షెల్టర్ ను కూడా తొలగించడం జరిగింది.ఇప్పటికి రెండేళ్లు పై బడుతున్న ఇటు నేషనల్ హైవే అథారిటీ అధికారులు కానీ అటు సంబంధిత అధికారులు,నాయకులకు

ప్రజా సంఘాలు మోర పెట్టుకున్న ఏమాత్రం ప్రజలకు అవసరం అయ్యే మౌలిక వసతుల కల్పన లో అశ్రద్ధ వహిస్తున్నరానడానికి ఇదే పెద్ద నిదర్శనం అని చెప్పవచ్చు.పలుమార్లు తహసీల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్, ఏపిఎస్ఆర్టిసి అధికారులకు వినతి పత్రం అందజేసిన ఇంత వరకు ఏమాత్రం సమస్య ను పరిష్కరించడం లేదు.వేసవి కాలం కావడం తో విద్యార్థులు,వృద్ధులు, మహిళలు, ప్రయాణికులు నిలవడానికి కూడా వసతి కల్పించాల్సిన భాద్యత అందరిపై ఉంది.బస్సు షెల్టర్ కోసం ఇప్పటికి అయిన అధికారులు స్పందించి బస్సు షెల్టర్ వసతి కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *