అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
పుంగనూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
“పార్టీ జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో, బైక్‌లపై తరలివచ్చిన కార్యకర్తలు,పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు.”
పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు.”

