పుంగనూరు పోలీస్ స్టేషన్‌ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అడిషనల్ ఎస్పీ

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :

పుంగనూరు :

పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, స్టేషన్ విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.తనిఖీల అనంతరం స్టేషన్ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ ఆన్సర్ భాష , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *