అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించిన మహిళా సంఘాలు
ర్యాలీలో పాల్గొన్న పుంగనూరు టిడిపి ఇన్చార్జి చల్లా బాబు
పుంగనూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గోకుల్ సర్కిల్ వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని, సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసిన మహిళలు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా బాబు హాజరయ్యారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు
తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఎల్లవేళలా అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు
ఈ కార్యక్రమంలోటీడీపీ నాయకులు, మాధవరెడ్డి, సివిరెడ్డి, రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్, మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

