అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయంలో అన్నమయ్య జిల్లా డి ఆర్ వో చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇప్పటివరకు పుంగనూరు నియోజకవర్గంలో 98.2 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని తెలిపారు
ఎస్ఐఆర్ ఫారాల డిజిటలైజేషన్ 47.55 శాతం పూర్తి చేశామని ఆయన అన్నారు
ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై 4, 5 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు జరుగుతాయని తెలిపారు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని డి ఆర్ వో చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు


