అన్నమయ్య జిల్లా :
సోమల :
పుంగనూరు నియోజకవర్గం
సోమల మండలం లో రైతులకు యూరియా దుకాణ నిర్వాహకులు కల్తీ డ్రిప్ ఎరువులు విక్రయిస్తున్నారని మంగళవారం ఉదయం రైతులు బస్టాండ్ లో ధర్నా నిర్వహించారు. యూరియా దుకాణ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ
పదివేల రూపాయలు విలువ చేస్తే డ్రిప్ ఎరువును కొనుగోలు చేయగా అందులో కేసరి రంగు ఉప్పు కలిపి ఉన్నారని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కల్తీ ఎరువులు విక్రయిస్తున్న యూరియా దుకాణ యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు

