అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
పుంగనూరు పట్టణంలోని నక్కబండ ప్రాంతంలో మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కుమారుడు తల్లిపై దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల మేరకు లేట్ ఖాదర్‌బాషా, భార్య రాహత్ జాన్ ను ఆమె కుమారుడు ఆసిఫ్, మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని, మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని తల్లి హితవు పలికింది.
దీంతో ఆవేశానికి గురైన ఆసిఫ్, చేతిలో ఉన్న కర్రతో తల్లి దాడి చేయగా తలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి బాధితురాలిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు

