అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
కౌండిన్య వంక పూడికతీత పనుల్లో అవకతవకలు, ప్రజాధనం వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్న సామాజిక కార్యకర్తలు,
పుంగనూరు పట్టణ పరిధిలోని కౌండిన్య నది వంకలో జరుగుతున్న పూడికతీత పనుల అస్తవ్యస్త విధానం ఉందని
గత కొంతకాలంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కౌండిన్య వంకలో మట్టి తీసే కార్యక్రమం జరుగుతోందని అయితే, వంక నుండి తీసిన మట్టిని నిబంధనల ప్రకారం వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు ఆ మట్టిని వంకకు అతి సమీపంలోనే (ప్రక్కనే) కుప్పలుగా పోస్తున్నారని దీనివల్ల చిన్నపాటి వర్షం రాగానే ఆ మట్టి అంతా తిరిగి వంకలోనే కొట్టుకుపోతోందని
ఇప్పటికే ఇదే వంకలో మూడు సార్లు మట్టి తీయడం, ఆ మట్టి మరలా వంకలోనే పడటం జరిగిందని
దీనివల్ల వంక విస్తరణకు ఎటువంటి ప్రయోజనం చేకూరకపోగా, ప్రజల సొమ్ము మాత్రం బిల్లుల రూపంలో వృధా అవుతోందని కేవలం బిల్లులు క్లియర్ చేసుకోవడానికే ఈ పనులు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని
తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఇకపై తీసిన మట్టిని వంకకు దూరంగా తరలించేలా చూడాలని, అలాగే గత మూడు సార్లు జరిగిన పనుల వ్యయంపై మరియు అవినీతిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని సామాజిక కార్యకర్తలు
అయుబ్ ఖాన్, నరసింహులు తెలిపారు


