ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఎల్‌వోలకు అవగాహన కార్యక్రమం

Prajalapaksham
1 Min Read

అన్నమయ్య జిల్లా :
పుంగనూరు :
పుంగనూరు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా నందు నిర్వహించిన ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై బి ఎల్ వో లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి,పుంగనూరు నియోజకవర్గ తహసిల్దారులు పాల్గొన్నారు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఎస్‌ఐఆర్ విధివిధానాలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఓటర్ల వివరాల సేకరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియపై వివరంగా అవగాహన కల్పించారు.
ఓటరు జాబితా పూర్తిగా ఖచ్చితత్వంతో ఉండేలా ప్రతి ఇంటిని సందర్శించి సమాచారం సేకరించాలని బీఎల్‌వోలకు సూచించారు. ప్రజలకు ఎన్నికల కమిషన్ నిబంధనలను వివరించి, అవసరమైన పత్రాలను సేకరించడంలో సహకరించాలని కోరారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు బీఎల్‌వోలకు సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *